Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 9వ అధ్యాయము

1  నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయములో మానని వేదనయున్నది, 
2  క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. 
3  పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరులకొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును. 
4  వీరు ఇశ్రాయేలీయులు; స్వీకృతపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రదానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. 
5  పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు ఆమెన్. 
6  అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరు ఇశ్రయేలీయులు కారు. 
7  అబ్రాహాము సంతానమైనంతమాత్రముచేత అందరు పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము2 అనబడును, 
8  అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు. 
9  వాగ్దానరూపమైన వాక్యమిదేమీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడుశారాకు కుమారుడు కలుగును. 3
10-12. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును4అని ఆమెతో చెప్పబడెను. 
13  ఇందుకు ప్రమాణముగా -నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని5అని వ్రాయబడియున్నది. 
14  కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. 
15  అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు -ఎవని కరుణింతునో వాని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలిచూపుదును6. 
16  కాగా (పొంద ) నిచ్ఛయించువానివలననైనను ప్రయాసపడువాని7వలననైనను కాదు గాని కరుణించు దేవునివలననే అగును. 
17  మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను -నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని8. 
18  కావున ఆయన ఎవని కనకరింప నిచ్ఛయించునో వాని కనికరించును; ఎవని కఠినపరచ నిచ్ఛయించునో వాని కఠినపరచును. 
19  అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. 
20  అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురుచెప్పు నీ వెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? 
21  ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? 
22  ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? 
23-24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపనచవలెననియున్న నేమి? 
25  ఆ ప్రకారము -నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. 
26  మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అనిహోషేయలో ఆయన చెప్పుచున్నాడు. 
27  మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని 
28  యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. 
29  మరియు యెషయా ముందు చెప్పినప్రకారముసైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానముశేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొర్రాను పోలియుందుము. 
30-31. అట్లయితే మన మేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు? 
32  వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దాని వెంటాడిరి. 
33  ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులోస్ధాపించుచున్నాను; ఆయనయందువిశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు3. అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. 
Download Audio File

No comments:

Post a Comment