Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 12వ అధ్యాయము

1  కాబట్టి సహోదరులారా, పరిశుద్దమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతనుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 
2  మీరు ఈ లోక3మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. 
3  తన్ను తాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్ధబుద్దిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతివానితోను చెప్పుచున్నాను. 
4  ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను 
5  ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము. 
6  మన కనుగ్రహింపబడిన 
7  కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతుము; పరిచర్యయైతే పరిచర్యలోను, 
8  బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగి యుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. 
9  మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదాని హత్తుకొని యుండుడి. 
10  సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. 
11  ఆసక్తి విషయములో మందులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి. 
12  నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్ధనయందు పట్టుదల కలిగియుండుడి. 
13  పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, ఆతిధ్యము శ్రద్ధగా ఇచ్చుచుండుడి. 
14  మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. 
15  సంతోషించువారితో సంతోషించుడి; 
16  ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సు కలిసి యుండుడి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులైయుండుడి. మీకు మీరే బుద్దిమంతులమని అనుకొనవద్దు. 
17  కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. 
18  శక్యమైతే సమస్త మనుష్యులతో మీ చేతనైనంతమట్టుకు సమాధానముగా ఉండుడి. 
19  ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును5అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడుయున్నది. 
20  కాబట్టి నీ శత్రువు ఆకలిగొలినియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము, అలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. 
21  కీడువలన జయింపబడక మేలుచేత కీడును జయించుము.

No comments:

Post a Comment