1 యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుడుగా 2-7. నుండుటకు పిలువబడినవాడును, దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికి, అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి ) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువాసనను పరిశుద్ద లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసు క్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్ధానుడైనందున పరిశుద్దమైన ఆత్మనుబట్టి ప్రభావముచేత దేవుని కుమారుడుగాను నిరూపింపబడిన వాడాయెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తువారుగా ఉండుటకు పిలువబడియున్నారు. 8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాను. 9-10. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీయొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని, నా ప్రార్ధనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్తవిషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. 11 స్ధిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని 12 ఆత్మసంబంధమైన కృపావరమేదైననూ మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. 13 సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడా ఫలమేదైనను పొందవలెనని అనేకపర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు. 14 హెల్లేనీయులకును హెల్లేనీయులుకానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్ధుడను. 15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 16 సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ రక్షణ యున్నది. 17 ఎందుకనిన --నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడియున్నప్రకారము2విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. 18 దుర్ణీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను దుర్ణీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. 19 ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 20 ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. 21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్ధులైరి. 22 వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపమగా మార్చిరి. 24 ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల పర్యంతము ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్. 26 అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్దమైన ధర్మమును అనుసరించిరి. 27 అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. 28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 29 అట్టివారు సమస్తమైన దుర్ణేతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము, వైరమను వాటితో నిండినవారై. 30 కొండెగాండ్లును అపవాదకులును దేవ ద్వేషులును హింసకులును అహంకారులును బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తలిదండ్రుల కవిధేయులును అవివేకులును. 31 మాట తప్పువారును అనురాగరహితులును నిర్దయులునైరి. 32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. Download Audio File
1 కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్ధుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? 2 అట్టి కార్యములు చేయు వారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. 3 అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? 4 లేదా, దేవుని అనుగ్రహము మారుమవస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 5 నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 6 ఆయన ప్రతినానికి వాని వాని క్రియలచొప్పున ప్రతిఫలమిచ్చును. 7 సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవము నిచ్చును. 8-9. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్ణీతికి లోబడువారిమీదకి ఆయన ఉగ్రతను రౌద్రమును (కలుగును. ) దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. 10 సత్ క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. 11 దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; 12 ధర్మశాస్త్రము కలిగినవారై పాపముచేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. 13 ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 14 ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన పక్షమున, వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకుతామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15 అట్టివారి మనస్సాక్షికూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రాసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. 16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు (ఈలాగు జరుగును. ) 17 నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? 18 ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైనవాటిని మెచ్చుకొనుచున్నవు కావా? 19 జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, 20 చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్దిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనైయున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? 21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? 22 వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్ళను దోచెదవా? 23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమాన పరచెదవా? 24 వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది? 25 నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. 26 కాబట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనిన పక్షమున అతడు సున్నతి లేనివాడునైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా? 27 మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? 28 బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. 29 అయితే అంతరంగమందు యూదుడైనవాడే యూదుడు. మరియు సున్నతి హృదయసంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును. Download Audio File
1 అట్లయితే యూదునికి కలిగిన ఆధిక్యమేమి? సున్నతివలన ప్రయోజనమేమి? 2 ప్రతి విషయమందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. 3 కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా?1అట్లనరాదు. 4 నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లునుఅని వ్రాయబడిన ప్రకారము2 ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడుకాక తీరడు. 5 మన దుర్ణీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినయెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్ధుడగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; 6 అట్లనరాదు. అట్లయినపక్షమున దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? 7 దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలించినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల? 8 మేలు కలుగుటకు కీడుచేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. 9 అలాగైన ఏమందుము? మేము వారికంటే శ్రేష్టులమా? ఎంతమాత్రము కాము. యూదులేమి హెల్లేనీయులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. 10 ఇందుకు (ప్రమాణముగా ) వ్రాయబడినదేమనగా. 11 నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు. 12 అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. 13 వారి గొంతుక తెరచిన సమాధి; తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవులక్రింద సర్పవిషమున్నది4. 14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి5. 15 రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. 16 నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. 17 శాంతిమార్గము వారెరుగరు6. 18 వారి దృష్టియెదుట దేవుని భయములేదు7. 19 ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవునియెదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్నవాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదము. 20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. 21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. 23 ఏ బేధమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 24 కాబట్టి (నమ్మువారు ) ఆయన కృప చేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా, నిర్హేతుకముగా8నీతిమంతులని తీర్చబడుచున్నారు. 25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని. 26 క్రీస్తుయేసురక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటికాలమందు తన నీతిని కనుపరచునిమిత్తము, తాను నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. 27 కాబట్టి అతిశయాస్పదమెక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాసన్యాయమును బట్టియే. 28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. 29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అవును అన్యజనులకును దేవుడే. 30 దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. 31 విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్ధిరపరచుచున్నాము. Download Audio File
1 కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము? 2 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయాస్పదము కలుగును గాని అది దేవునియెదుట కలుగదు. 3 లేఖనమేమి చెప్పుచున్నది అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 1 4 పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని యెంచబడదు. 5 పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 6 ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడా చెప్పుచున్నాడు. 7 ఏలాగనగా ఎవరి అతిక్రమములు క్షమించబడెనో ఎవరి పాపములు కప్పివేయబడెనో వారు ధన్యులు. 8 ప్రభువు ఏ మనుష్యునిగూర్చి పాపమును ఎంచడో వాడు ధన్యుడు. 2 9 ఈ శుభవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పినదా సున్నతిలేనివారినిగూర్చి చెప్పినదా? అబ్రాహాముయొక్క విశ్వాసమతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా? 10 మంచిది; అది ఏ స్ధితియందు ఎంచబడెను? సున్నతి కలిగియుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే. 11 మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రియగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలనైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. 12 మరియు సున్నతిగలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనినవారికి తండ్రి అగుటకు, (అతడు ఆ గురుతు పొందెను ) 13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదు గాని విశ్వాసమువలననైన నీతిమూలముగానే కలిగెను. 14 ధర్మశాస్త్రసంబంధులు వారసులైనపక్షమున విశ్వాసము వ్యర్ధమగును, వాగ్దానమును నిరర్ధకమగును. 15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేనిపక్షమున అతిక్రమమును లేకపోవును. 16 ఈ హేతువుచేతను ఆ వాగ్దానము యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రము కాక అబ్రాహాముకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను. 17 తాను విశ్వసించిన దేవునియెదుట, అనగా మృతులను సజీవులునుగా చేయువాడునైన దేవునియెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని3అని అందుకు (ప్రమాణముగా ) వ్రాయబడియున్నది. 18 నీ సంతానము ఈలాగు ఉండునని4చెప్పినదానిబట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,. 20 అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక 21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్దుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. 22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 23 అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు, 24 మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయబడెను. 25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. Download Audio File
1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము1. 2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము. 3-4. అంతేకాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. 5 మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. 6 ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. 7 నీతిమంతునికొరతు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. 8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింక పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. 9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయనద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 10 ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున, సమాధాన పరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్ధితి పొందియున్నాము. 12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును, పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను2. 13 ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. 14 అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపముచేయని వారిమీదకూడా, ఆదాము మొదలుకొని మోషే పర్యంతము మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను. 15 అయితే అపరాధము కలిగినట్టు కృపావరమును కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయిన పక్షమున, మరి నిశ్చయముగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. 16 మరియు పాపముచేసిన యొకనివలన (శిక్షావిధి ) కలుగునట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై (మనుష్యులు ) నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. 17 మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకనిద్వారానే యేలినపక్షమున, కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకనిద్వారానే యేలుదురు. 18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులందరికి శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, అలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. 19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 20 మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. 21 అయినను పాపము మరణమును ఆధారముచేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. Download Audio File
1 అలాగైన యేమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? 2 అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? 3 క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? 4 కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో (పాలుపొందుటకై ) ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. 5 మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన యెడల, ఆయన పునరుత్ధానముయొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమై యుందుము. 6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్ధకమగునట్లు, మన ప్రాచీనస్వభావము3ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము. 7 చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొంది యున్నాడు. 8-9. మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము. 10 ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవంచుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు. 11 అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు జీవితులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. 12 కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. 13 మరియు మీ అవయవములను దుర్ణీతి సాధనములుగా1పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి జీవితులమనుకొని, మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 15 అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికి కూడదు. 16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులగా అప్పగించుకొందురో, అది మరణార్ధముగా పాపమునకే గాని, నీత్యర్ధముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? 17 మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వముగా లోబడిన వారై. 18 పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. 19 మీ శరీర బలహీనతనుబట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 20 మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. 21 అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను; వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? 22 అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. 23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. Download Audio File
1 సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంత కాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. 2 భర్తగల స్త్రీ భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదలపొందును. 3 కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభచారిణియనబడును గాని, ఆమె భర్త చనిపోయిన యెడల ధర్మశాస్త్రమునుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని చేరినను వ్యభచారిణి కాకపోవును. 4 కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వరా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. 5 ఏలయనగా మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్ధమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయలములలో కార్యసాధకములైయుండెను. 6 ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదలపొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్ధితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్ధితి గలవారమై సేవచేయుచున్నాము. 7 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. 8 అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. 10 అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్ధమైనట్టు కనబడెను. 11 ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. 12 కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. 13 ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైనదాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడునిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, (అది నాకు మరణకరమాయెను. ) 14 ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను. 15 ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను (చేయ ) నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. 16 ఇచ్ఛయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. 17 కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాను. 18 నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను ఇచ్ఛ నాకు తటస్థమై యున్నది గాని, దాని చేయుట నాకు తటస్థముకాదు. 19 నేను చేయ నిచ్ఛయించు మేలుచేయక యిచ్ఛయింపని కీడు చేయుచున్నాను. 20 నేను ఇచ్ఛయింపనిదానిని చేసినయెడల, అది చేయునది నాయందు నివసించు పాపమేగాని యికను నేను కాను. 21 కాబట్టి మేలుచేయ నిచ్ఛయించు నాకు కీడు తటస్థమైయున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 22 అంతరంగపురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని. 23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోపరచుకొనుచున్నది. 24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను; ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? 25 మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సువిషయములో నేను దైవనియమమునకును, శరీరవిషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను. Download Audio File
1 కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. 2 క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. 3-4. శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప (పరిహారము ) నిమిత్తము దేవుడు తన స్వకీయకుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏలయనగా శరీరస్వభావమును బట్టి ధర్మశాస్త్రము బలహీనమాయెను గనుక అది దానికి అసాధ్యమాయెను. 5 శరీరానుసారులు శరీరవిషయములను మనస్కరింతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. 6 శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. 7 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది;అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 8 కాగా శరీరస్వభావముగల వారు దేవుని సంతోషపరచనేరరు. 9 దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున మీరు ఆత్మస్వభావముగలవారే గాని శరీరస్వభావముగలవారు కారు. 1ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు. 10 క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవయుక్తమైనది. 11 మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావుకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. 12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్ధులము కాము. 13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల జీవించెదరు. 14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. 15 ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృతపుత్రాత్మను2పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము నాయనా తండ్రీ అని మొర్రపెట్టుచున్నాము. 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. 17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోటి వారసులము. 18 మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. 19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 20-21. ఏలయనగా సృష్టి క్షయాధీనదాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా మాయకు లోపరచబడెను. 22 సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదము. 23 అంతేకాదు, ఆత్మయొక్క ప్రధమ ఫలముల నొందిన మనముకూడ స్వీకృతపుత్రత్వము కొరకు, అనగా మన దేహముయొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగినవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని యుండదు; తాను చూచుచున్నదానికొరకు ఎవడు నిరీక్షించును? 25 మనము చూడనిదానికొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. 26 అటువలె ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. 27 మరియు హృదయములను పరిశోధించు వాడు ఆత్మయెక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని3యెరుగుదుము. 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. 31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షమున నుండగా మనకు విరోధియెవడు? 32 తన స్వకీయకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 33 దేవుని చేత ఏర్పరచబడినవారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయినవాడు క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడు ఆయనే; ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై, మన కొరకు విజ్ఞాపనముకూడ చేయుచున్నాడు. 35 క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 36 ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినదేమనగా -మేము నీ నిమిత్తము దినమెల్ల చంపబడుచున్నాము; వధకైన గొర్రెలగా ఎంచబడుచున్నాము. 37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను 39 ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసుద్వారా కనపరచబడియున్న దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. Download Audio File
1 నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయములో మానని వేదనయున్నది, 2 క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. 3 పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరులకొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును. 4 వీరు ఇశ్రాయేలీయులు; స్వీకృతపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రదానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు ఆమెన్. 6 అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరు ఇశ్రయేలీయులు కారు. 7 అబ్రాహాము సంతానమైనంతమాత్రముచేత అందరు పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము2 అనబడును, 8 అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు. 9 వాగ్దానరూపమైన వాక్యమిదేమీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడుశారాకు కుమారుడు కలుగును. 3 10-12. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును4అని ఆమెతో చెప్పబడెను. 13 ఇందుకు ప్రమాణముగా -నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని5అని వ్రాయబడియున్నది. 14 కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. 15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు -ఎవని కరుణింతునో వాని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలిచూపుదును6. 16 కాగా (పొంద ) నిచ్ఛయించువానివలననైనను ప్రయాసపడువాని7వలననైనను కాదు గాని కరుణించు దేవునివలననే అగును. 17 మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను -నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని8. 18 కావున ఆయన ఎవని కనకరింప నిచ్ఛయించునో వాని కనికరించును; ఎవని కఠినపరచ నిచ్ఛయించునో వాని కఠినపరచును. 19 అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. 20 అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురుచెప్పు నీ వెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? 21 ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? 22 ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? 23-24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపనచవలెననియున్న నేమి? 25 ఆ ప్రకారము -నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. 26 మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అనిహోషేయలో ఆయన చెప్పుచున్నాడు. 27 మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని 28 యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. 29 మరియు యెషయా ముందు చెప్పినప్రకారముసైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానముశేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొర్రాను పోలియుందుము. 30-31. అట్లయితే మన మేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు? 32 వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దాని వెంటాడిరి. 33 ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులోస్ధాపించుచున్నాను; ఆయనయందువిశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు3. అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. Download Audio File
1 సహోదరులారా, (ఇశ్రాయేలీయులు ) రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్ధనయునై యున్నవి. 2 వారు దేవునియందు ఆసక్తిగలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 3 ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్ధాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు. 5 ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. 6 అయితే విశ్వాసమూలమగు నీతి 7 ఈలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోకి ఎక్కిపోవును?5అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేక ఎవడు అగాధములోకి దిగిపోవును?6అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. 8 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ హృదయములోను ఉన్నది;7అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. 9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 11 ఏమనగా ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. 12 యూదుడని హెల్లేనీయుడని భేదములేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్ధనచేయువారందరియెడల (కృపచూపుటకు ) ఐశ్వర్యవంతుడైయున్నాడు. 13 ఎందుకనగా ప్రభువు నామముబట్టి ప్రార్ధనచేయువాడెవడో వాడు రక్షింపబడును. 14 వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్ధన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండ వారెట్లు విందురు? 15 (ప్రకటించువారు ) పంపబడనియెడల ఎట్లు ప్రకటించుదురు?ఇందు విషయమై-ఉత్తమమైన వాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో చక్కనివి అని వ్రాయబడి యున్నది. 16 అయినను అందరు సువార్తకు లోబడలేదుప్రభువా, మా వర్తమానమెవడు విశ్వసించెను? అని యెషయా చెప్పుచున్నాడు గదా? 17 కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. 18 అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను. 19 మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలుకు తెలియకుండెనా?జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగజేతును2అని మొదట మోషే చెప్పుచున్నాడు. 20 మరియు యెషయా తెగించి 21 నన్ను వెదకనివారికి నేను దొరికితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని3అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. Download Audio File
1 అలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. 2 తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? 3 ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీబలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారుఅని ఇశ్రాయేలుకు విపక్షముగా దేవుని యెదుట అతడు విజ్ఞాపనము చేయుచున్నాడు. 4 అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది?బయలుకు మోకాళ్లూనని యేడువేలమందిపురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. 5 5 అలాగుననే ఇప్పటికాలమందు సహితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది. 6 అది కృపచేతనైన పక్షమున ఇకను క్రియల మూలమైనది కాదు; కానిపక్షమున కృప ఇకను కృప కాకపోవును. 7 అలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి. 8 ఇందువిషయమై -నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగలమనస్సును చూడలేని కన్నులను వినలేనిచెవులను ఇచ్చియున్నాడనివ్రాయబడియున్నది. 9 మరియు -వారి భోజనము వారికి ఉరిగాను బోనుగానుఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలము గాను ఉండుగాక. 10 వారు చూడకుండునట్లువారి కన్నులకు చీకటి కమ్ముగాక. వారి వీపునుఎల్లప్పుడు వంగిపోవునట్లు చేయుముఅని దావీదు చెప్పుచున్నాడు. 11 కాబట్టి నేనడుగునది ఏమనగా, పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటువలన అన్యజనులకు రక్షణ కలిగెను. 12 వారి తొట్రుపాటులోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును. 13 అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. 14 నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. 15 వారిని విసర్జించుట లోకమును సమాధానపరచనయ్యెనా, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీనవులైనట్టే గదా? 16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్దమే; వేరు పరిశుద్దమైనదైతే కొమ్మలును పరిశుద్దములే. 17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడు అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటు కట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలుపొందిన యెడల, ఆ కొమ్మలపైని నీవు అతిశయింపకుము. 18 నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. 19 అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. 20 మంచిది; వారు అవిశ్వామునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము; 21 దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని పక్షమున నిన్నును విడిచిపెట్టడు. 22 దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు ఆ అనుగ్రహప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద దేవుని అనుగ్రహమును చూడుము; నిలువకపోయినయెడల నీవును నరికివేయబడుదువు. 23 వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటు కట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు. 24 ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవచెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవచెట్టున అంటు కట్టబడిన పక్షమున, స్వాభావికమైన కొమ్మలగువారు మరి నిశ్చయముగా తమ స్వకీయమైన ఒలీవచెట్టున అంటు కట్టబడుదురు కారా? 25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా అన్యజనులు సంపూర్ణముగా ప్రవేశించువరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. 26 వారు ప్రవేశించునప్పుడు 27 విమోచకుడు సీయోనులోనుండి వచ్చియాకోబులోనుండి భక్తిహీనతను తొలగించును;నేను వారి పాపములను పరిహరించినప్పుడునా వలన వారికి కలుగు నిబంధన ఇదియేఅని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు. 28 సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులుగాని యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు. 29 ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. 30-31. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులైయుండి, 32 అందరియెడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయతాస్ధితిలో మూసివేసి యున్నాడు. 33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. 34 ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? 35 ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? 36 ఆయన మూలముగను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. Download Audio File
1 ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. 2 కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు;ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. 3-4. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడకుండ కోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. 5 కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట అవశ్యకము. 6 ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగి యుందురు. 7 ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. 8 ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. ఎదుటివాని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. 9 ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్యచేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. 10 ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. 11 మరియు మీరు నిద్రమేలుకొను వేళయైనదని సమయము తెలిసికొని ఆలాగు (చేయుడి ) మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. 12 రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించకొందము. 13 అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరిచేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. 14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి. Download Audio File
1 విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయాస్పద వాదములను పెట్టుకొనుటకు వద్దు. 2 ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి. కూరగాయలనే తినుచున్నాడు. 3 తినువాడు తిననివానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతని చేర్చుకొనెను. 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని స్వకీయ యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతని నిలువబెట్టుటకు శక్తిగలవాడు. 5 ఒకడు ఒక దినముకంటె మరియొక దినము విశేషమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. 6 దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువును స్మరించి లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువును స్మరించి తినుచున్నాడు; తిననివాడు ప్రభువును స్మరించి తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు. 7 మనలో ఎవడును తనకోసరము బ్రదుకడు, ఎవడును తనకోసరము చనిపోడు. 8 మనము బ్రదికినను ప్రభువు కోసరము బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసరమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమైయున్నాము. 9 తాను మృతులకును సజీవుసకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి (మరల ) బ్రదికెను. 10 అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. 11 నా తోడు ప్రతి మోకాలును నా యెదుట వంగును; 12 ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. 13 కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. 14 సహజముగా ఏదియు నిషిద్దము కాదని నేను ప్రభువైన యేసునందున్న వాడనై యెరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్దమని యెంచుకొనువానికి అది నిషిద్దమే. 15 నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినయెడల నీ వికను ప్రేమకలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడుచేయకుము. 16 మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. 18 ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యడునై యున్నాడు. 19 కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. 20 భోజనము నిమిత్తము దేవుని పని పాడుచేయకుడి; సమస్త పదార్ధములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము. 21 మాంసభక్షణ గాని ద్రాక్షరసపానము గాని నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. 22 నీలో ఉన్న విశ్వాసము దేవునియెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయమలో తనకుతానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. 23 అనుమానించువాడు తినిన పక్షమున విశ్వాసములేకుండ తినును గనుక దోషియని తీర్పునొందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. Download Audio File
1 కాగా బలవ0తులమైన మనము మనలను మనమే స0తోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరి0చుటకు బద్దులమై యున్నాము. 2 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైనదానియందు అతని సంతోషపరచవలెను. 3 క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని -నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెనుఅని వ్రాయబడియున్నట్లు(ఆయనకు సంభవించెను) 4 ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగునట్లు వ్రాయబడియున్నవి. 5-6. మీరేకభావము గలవారై యేకగ్రీవముగామన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసిన వారై యుండునట్లు ఓర్పుకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించుగాక. 7 కాబట్టి క్రీస్తు మిమ్మునుచేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనికొకడు చేర్చుకొనుడి. 8-9. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్ధాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచాకుడాయెను. అందువిషయమై -ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్నుస్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదునుఅని వ్రాయబడియున్నది. 10 మరియుఅన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు6 11 మరియుసకలమైన అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి7సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాకఅనియు చెప్పియున్నది. 12 మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు -యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగాఅన్యజనుల నేలుటకు పుట్టువాడు వచ్చును;ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. 8 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణగలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసముద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. 14 నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్దిచెప్ప సమర్ధులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మునుగూర్చి రూఢిగా నమ్ముచున్నాను. 15-16. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధ పరచబడి ప్రీతికరమగునట్లు, నేను సువార్తవిషయమై యాజకధర్మము జరిగించుచు, దేవునిచేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైనతిని. ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. 17 కాగా క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయాస్పదము కలదు. 18-19. ఏలగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలముచేతను మహత్కార్యముల బలముచేతను పరశుద్దాత్మ బలముచేతను క్రీస్తు( నా ద్వారా చేయించినవాటిని గూర్చియే గాని) చేయింపనివాటిలో దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములయందు ఇల్లూరికు ప్రాంత పర్యంతము, క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి యున్నాను. 20-21. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తముఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడలేదోవారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారముక్రీస్తు నామమెరుగనిచోనట్లనుసువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. 22 ఈ హేతువుచేతను మీయెద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. 23-24. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక (సంచరింపవలసిన) భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీ యెద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, నేను స్పానియాకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మెదట మీ సహవాసమువలన కొంతమట్టుకు సంతృప్తిపొంది, మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. 25 అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరచర్య చేయుచు యెరూషలేముకు వెళ్లుచున్నాను. 26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరశుద్ధులలో బీదలైనవారి నిమిత్తము మకెదొనియవారును అకైయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి. 27 అవును వారిష్టపడి దాని చేసిరి; వారు వారికి రుణస్ధులు; ఎట్లనగా అన్యజనులు వారి ఆత్మసంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులైయున్నారు. 28 ఈ పని ముగించి యీ ఫలమును వారి కప్పగించి, 2నేను మీ పట్టణముమీదుగా స్పానియాకు ప్రయాణము చేతును. 29 నేను మీయెద్దకు వచ్చునప్పుడు క్రీస్తుయొక్క ఆశీర్వాద పరిపూర్ణుడనై వత్తునని యెరుగుదును. 30 సహోదరులారా, నేను యూదైయలో నున్న 31-32. అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్ధనలయందు నాతో కలసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 33 సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడైయుండుగాక. ఆమేన్. Download Audio File