Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 11వ అధ్యాయము

1  అలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. 
2  తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? 
3  ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీబలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారుఅని ఇశ్రాయేలుకు విపక్షముగా దేవుని యెదుట అతడు విజ్ఞాపనము చేయుచున్నాడు. 
4  అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది?బయలుకు మోకాళ్లూనని యేడువేలమందిపురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. 5 
5  అలాగుననే ఇప్పటికాలమందు సహితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది. 
6  అది కృపచేతనైన పక్షమున ఇకను క్రియల మూలమైనది కాదు; కానిపక్షమున కృప ఇకను కృప కాకపోవును. 
7  అలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి. 
8  ఇందువిషయమై -నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగలమనస్సును చూడలేని కన్నులను వినలేనిచెవులను ఇచ్చియున్నాడనివ్రాయబడియున్నది. 
9  మరియు -వారి భోజనము వారికి ఉరిగాను బోనుగానుఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలము గాను ఉండుగాక. 
10  వారు చూడకుండునట్లువారి కన్నులకు చీకటి కమ్ముగాక. వారి వీపునుఎల్లప్పుడు వంగిపోవునట్లు చేయుముఅని దావీదు చెప్పుచున్నాడు. 
11  కాబట్టి నేనడుగునది ఏమనగా, పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటువలన అన్యజనులకు రక్షణ కలిగెను. 
12  వారి తొట్రుపాటులోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును. 
13  అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. 
14  నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. 
15  వారిని విసర్జించుట లోకమును సమాధానపరచనయ్యెనా, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీనవులైనట్టే గదా? 
16  ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్దమే; వేరు పరిశుద్దమైనదైతే కొమ్మలును పరిశుద్దములే. 
17  అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడు అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటు కట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలుపొందిన యెడల, ఆ కొమ్మలపైని నీవు అతిశయింపకుము. 
18  నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. 
19  అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. 
20  మంచిది; వారు అవిశ్వామునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము; 
21  దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని పక్షమున నిన్నును విడిచిపెట్టడు. 
22  దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు ఆ అనుగ్రహప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద దేవుని అనుగ్రహమును చూడుము; నిలువకపోయినయెడల నీవును నరికివేయబడుదువు. 
23  వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటు కట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు. 
24  ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవచెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవచెట్టున అంటు కట్టబడిన పక్షమున, స్వాభావికమైన కొమ్మలగువారు మరి నిశ్చయముగా తమ స్వకీయమైన ఒలీవచెట్టున అంటు కట్టబడుదురు కారా? 
25  సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా అన్యజనులు సంపూర్ణముగా ప్రవేశించువరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. 
26  వారు ప్రవేశించునప్పుడు 
27  విమోచకుడు సీయోనులోనుండి వచ్చియాకోబులోనుండి భక్తిహీనతను తొలగించును;నేను వారి పాపములను పరిహరించినప్పుడునా వలన వారికి కలుగు నిబంధన ఇదియేఅని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు. 
28  సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులుగాని యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు. 
29  ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. 
30-31. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులైయుండి, 
32  అందరియెడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయతాస్ధితిలో మూసివేసి యున్నాడు. 
33  ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. 
34  ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? 
35  ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? 
36  ఆయన మూలముగను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. 
Download Audio File

No comments:

Post a Comment