Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 10వ అధ్యాయము

1  సహోదరులారా, (ఇశ్రాయేలీయులు ) రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్ధనయునై యున్నవి. 
2  వారు దేవునియందు ఆసక్తిగలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 
3  ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్ధాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 
4  విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు. 
5  ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. 
6  అయితే విశ్వాసమూలమగు నీతి 
7  ఈలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోకి ఎక్కిపోవును?5అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేక ఎవడు అగాధములోకి దిగిపోవును?6అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. 
8  అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ హృదయములోను ఉన్నది;7అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. 
9  అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 
10  ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 
11  ఏమనగా ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. 
12  యూదుడని హెల్లేనీయుడని భేదములేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్ధనచేయువారందరియెడల (కృపచూపుటకు ) ఐశ్వర్యవంతుడైయున్నాడు. 
13  ఎందుకనగా ప్రభువు నామముబట్టి ప్రార్ధనచేయువాడెవడో వాడు రక్షింపబడును. 
14  వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్ధన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండ వారెట్లు విందురు? 
15  (ప్రకటించువారు ) పంపబడనియెడల ఎట్లు ప్రకటించుదురు?ఇందు విషయమై-ఉత్తమమైన వాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో చక్కనివి అని వ్రాయబడి యున్నది. 
16  అయినను అందరు సువార్తకు లోబడలేదుప్రభువా, మా వర్తమానమెవడు విశ్వసించెను? అని యెషయా చెప్పుచున్నాడు గదా? 
17  కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. 
18  అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను. 
19  మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలుకు తెలియకుండెనా?జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగజేతును2అని మొదట మోషే చెప్పుచున్నాడు. 
20  మరియు యెషయా తెగించి 
21  నన్ను వెదకనివారికి నేను దొరికితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని3అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. 
Download Audio File

No comments:

Post a Comment