1 సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంత కాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను.
2 భర్తగల స్త్రీ భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదలపొందును.
3 కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభచారిణియనబడును గాని, ఆమె భర్త చనిపోయిన యెడల ధర్మశాస్త్రమునుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని చేరినను వ్యభచారిణి కాకపోవును.
4 కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వరా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి.
5 ఏలయనగా మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్ధమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయలములలో కార్యసాధకములైయుండెను.
6 ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదలపొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్ధితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్ధితి గలవారమై సేవచేయుచున్నాము.
7 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
8 అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.
10 అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్ధమైనట్టు కనబడెను.
11 ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.
12 కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.
13 ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైనదాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడునిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, (అది నాకు మరణకరమాయెను. )
14 ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను.
15 ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను (చేయ ) నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.
16 ఇచ్ఛయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.
17 కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాను.
18 నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను ఇచ్ఛ నాకు తటస్థమై యున్నది గాని, దాని చేయుట నాకు తటస్థముకాదు.
19 నేను చేయ నిచ్ఛయించు మేలుచేయక యిచ్ఛయింపని కీడు చేయుచున్నాను.
20 నేను ఇచ్ఛయింపనిదానిని చేసినయెడల, అది చేయునది నాయందు నివసించు పాపమేగాని యికను నేను కాను.
21 కాబట్టి మేలుచేయ నిచ్ఛయించు నాకు కీడు తటస్థమైయున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.
22 అంతరంగపురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని.
23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోపరచుకొనుచున్నది.
24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను; ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
25 మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సువిషయములో నేను దైవనియమమునకును, శరీరవిషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.
Download Audio File

No comments:
Post a Comment