Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 14వ అధ్యాయము

1  విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయాస్పద వాదములను పెట్టుకొనుటకు వద్దు. 
2  ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి. కూరగాయలనే తినుచున్నాడు. 
3  తినువాడు తిననివానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతని చేర్చుకొనెను. 
4  పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని స్వకీయ యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతని నిలువబెట్టుటకు శక్తిగలవాడు. 
5  ఒకడు ఒక దినముకంటె మరియొక దినము విశేషమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. 
6  దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువును స్మరించి లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువును స్మరించి తినుచున్నాడు; తిననివాడు ప్రభువును స్మరించి తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు. 
7  మనలో ఎవడును తనకోసరము బ్రదుకడు, ఎవడును తనకోసరము చనిపోడు. 
8  మనము బ్రదికినను ప్రభువు కోసరము బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసరమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమైయున్నాము. 
9  తాను మృతులకును సజీవుసకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి (మరల ) బ్రదికెను. 
10  అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. 
11  నా తోడు ప్రతి మోకాలును నా యెదుట వంగును; 
12  ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. 
13  కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. 
14  సహజముగా ఏదియు నిషిద్దము కాదని నేను ప్రభువైన యేసునందున్న వాడనై యెరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్దమని యెంచుకొనువానికి అది నిషిద్దమే. 
15  నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినయెడల నీ వికను ప్రేమకలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడుచేయకుము. 
16  మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. 
17  దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. 
18  ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యడునై యున్నాడు. 
19  కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. 
20  భోజనము నిమిత్తము దేవుని పని పాడుచేయకుడి; సమస్త పదార్ధములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము. 
21  మాంసభక్షణ గాని ద్రాక్షరసపానము గాని నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. 
22  నీలో ఉన్న విశ్వాసము దేవునియెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయమలో తనకుతానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. 
23  అనుమానించువాడు తినిన పక్షమున విశ్వాసములేకుండ తినును గనుక దోషియని తీర్పునొందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. 
Download Audio File

No comments:

Post a Comment