1 యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుడుగా
2-7. నుండుటకు పిలువబడినవాడును, దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికి, అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి ) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువాసనను పరిశుద్ద లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసు క్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్ధానుడైనందున పరిశుద్దమైన ఆత్మనుబట్టి ప్రభావముచేత దేవుని కుమారుడుగాను నిరూపింపబడిన వాడాయెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తువారుగా ఉండుటకు పిలువబడియున్నారు.
8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాను.
9-10. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీయొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని, నా ప్రార్ధనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్తవిషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.
11 స్ధిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని
12 ఆత్మసంబంధమైన కృపావరమేదైననూ మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను.
13 సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడా ఫలమేదైనను పొందవలెనని అనేకపర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు.
14 హెల్లేనీయులకును హెల్లేనీయులుకానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్ధుడను.
15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.
16 సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ రక్షణ యున్నది.
17 ఎందుకనిన --నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడియున్నప్రకారము2విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
18 దుర్ణీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను దుర్ణీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.
19 ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.
20 ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్ధులైరి.
22 వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపమగా మార్చిరి.
24 ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల పర్యంతము ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్.
26 అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్దమైన ధర్మమును అనుసరించిరి.
27 అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.
28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
29 అట్టివారు సమస్తమైన దుర్ణేతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము, వైరమను వాటితో నిండినవారై.
30 కొండెగాండ్లును అపవాదకులును దేవ ద్వేషులును హింసకులును అహంకారులును బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తలిదండ్రుల కవిధేయులును అవివేకులును.
31 మాట తప్పువారును అనురాగరహితులును నిర్దయులునైరి.
32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
Download Audio File

No comments:
Post a Comment