Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 15వ అధ్యాయము

1  కాగా బలవ0తులమైన మనము మనలను మనమే స0తోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరి0చుటకు బద్దులమై యున్నాము. 
2  తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైనదానియందు అతని సంతోషపరచవలెను. 
3  క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని -నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెనుఅని వ్రాయబడియున్నట్లు(ఆయనకు సంభవించెను) 
4  ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగునట్లు వ్రాయబడియున్నవి. 
 5-6. మీరేకభావము గలవారై యేకగ్రీవముగామన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసిన వారై యుండునట్లు ఓర్పుకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించుగాక. 
7  కాబట్టి క్రీస్తు మిమ్మునుచేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనికొకడు చేర్చుకొనుడి. 
8-9. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్ధాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచాకుడాయెను. అందువిషయమై -ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్నుస్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదునుఅని వ్రాయబడియున్నది. 
10  మరియుఅన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు6
11  మరియుసకలమైన అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి7సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాకఅనియు చెప్పియున్నది. 
12  మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు -యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగాఅన్యజనుల నేలుటకు పుట్టువాడు వచ్చును;ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. 8
13  కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణగలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసముద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. 
14  నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్దిచెప్ప సమర్ధులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మునుగూర్చి రూఢిగా నమ్ముచున్నాను. 
15-16. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధ పరచబడి ప్రీతికరమగునట్లు, నేను సువార్తవిషయమై యాజకధర్మము జరిగించుచు, దేవునిచేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైనతిని. ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. 
17  కాగా క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయాస్పదము కలదు. 
  18-19. ఏలగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలముచేతను మహత్కార్యముల బలముచేతను పరశుద్దాత్మ బలముచేతను క్రీస్తు( నా ద్వారా చేయించినవాటిని గూర్చియే గాని) చేయింపనివాటిలో దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములయందు ఇల్లూరికు ప్రాంత పర్యంతము, క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి యున్నాను. 
20-21. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తముఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడలేదోవారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారముక్రీస్తు నామమెరుగనిచోనట్లనుసువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. 
22  ఈ హేతువుచేతను మీయెద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. 
23-24. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక (సంచరింపవలసిన) భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీ యెద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, నేను స్పానియాకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మెదట మీ సహవాసమువలన కొంతమట్టుకు సంతృప్తిపొంది, మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. 
25  అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరచర్య చేయుచు యెరూషలేముకు వెళ్లుచున్నాను. 
26  ఏలయనగా యెరూషలేములో ఉన్న పరశుద్ధులలో బీదలైనవారి నిమిత్తము మకెదొనియవారును అకైయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి. 
27  అవును వారిష్టపడి దాని చేసిరి; వారు వారికి రుణస్ధులు; ఎట్లనగా అన్యజనులు వారి ఆత్మసంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులైయున్నారు. 
28  ఈ పని ముగించి యీ ఫలమును వారి కప్పగించి, 2నేను మీ పట్టణముమీదుగా స్పానియాకు ప్రయాణము చేతును. 
29  నేను మీయెద్దకు వచ్చునప్పుడు క్రీస్తుయొక్క ఆశీర్వాద పరిపూర్ణుడనై వత్తునని యెరుగుదును. 
30  సహోదరులారా, నేను యూదైయలో నున్న 
31-32. అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్ధనలయందు నాతో కలసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
33  సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడైయుండుగాక. ఆమేన్. 
Download Audio File

No comments:

Post a Comment