1-2. కెంక్రెయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
3 క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి.
4 వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైన తెగించిరి. మరియు వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు.
5 ఆసియాలో క్రీస్తుకు ప్రధమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
6 మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.
7 నాకు బంధువులును నాతోటి ఖైదీలునైన అంద్రోనికుకును యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధికెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
8 ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయాతుకు వందనములు.
9 క్రీస్తునందు మన జతపనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకుకును వందనములు.
10 క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టోబులు ఇంటివారికి వందనములు.
11 నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందున్నవారికి వందనములు.
12 ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సికి వందనములు; ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను.
13 ప్రభువునందు ఏర్పరచబడిన రూపుకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి.
14 అసుంక్రీతుకును, ప్లెగోనుకును, హెర్మేకును, పత్రోబకును, హెర్మాకును వారితోకూడనున్న సహోదరులకును వందనములు.
15 పిలొలొగుకును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్ధులకందరికిని వందనములు.
16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
17 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేధములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
18 అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
19 మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.
20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండు గాక.
21 నా జతపనివాడగు తిమొథెయు, నా బంధువులగు లూకియ, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.
22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.
23-24. నాకును యావత్సంఘమునకును ఆథిత్యముచేయు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
25-27. అనాదినుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్తప్రకారము గాను, యేసుక్రీస్తునుగూర్చిన ప్రకటనప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమెన్.
Download Audio File

No comments:
Post a Comment